Good News: త్వరలో మరో డీఎస్సీ..?... సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-05 11:25:15  IST  )

ప్రతి ఏటా మెగా డీఎస్సీ నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు..

Good News: త్వరలో మరో డీఎస్సీ..?... సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం(Coalition Government) అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్యపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మెగా డీఎస్సీ(Mega Dsc) నిర్వహించింది. మరోసారి కూడా డీఎస్సీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా(Parvatipuram Manyam District) బామినిలో పర్యటించిన ఆయన త్వరలో మరో డీఎస్సీ నిర్వహించబోతున్నట్లు హింట్ ఇచ్చారు. ఇక నుంచి ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని తెలిపారు. తాము చేపట్టిన మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయన్నారు. ఈ నెల 10 నుంచి టెట్ నిర్వహించబోతున్నామన్నారు. దేశంలోనే నెంబర్ వన్‌గా ఏపీ(Ap) విద్యారంగాన్ని తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) తెలిపారు. రాష్ట్రానికి స్పేస్ , డ్రోన్ సిటీని తీసుకురాబోతున్నామని వెల్లడించారు. కేంద్రం అనుమతిస్తే మరో రెండేళ్లలో ఎయిర్, డ్రోన్ ట్యాక్సీలు తీసుకొస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

Next Story