Srikakulam | స్వగ్రామానికి చేరుకున్న టెక్ శంకర్ మృతదేహం

by Thanuru Gopichand |

బుధవారం మారేడుమిల్లి వద్ద జరిగిన ఎన్ కౌంటర్లో మేటూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ (Tech Shankar) ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే.

Srikakulam | స్వగ్రామానికి చేరుకున్న టెక్ శంకర్ మృతదేహం
X

దిశ, వెబ్ డెస్క్ : బుధవారం మారేడుమిల్లి వద్ద జరిగిన ఎన్ కౌంటర్లో మేటూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ (Tech Shankar) ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఈ క్రమంలో పోలీసులు ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో వారు టెక్ శంకర్ స్వగ్రామానికి మృతదేహంతో పాటు చేరుకున్నారు. దీంతో శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామంలో విషాదం నెలకొంది. టెక్ శంకర్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పాటు, ప్రజా సంఘాలు, సానుభూతిపరులు గ్రామానికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. టెక్ శంకర్ కు తుది నివాళులు అర్పించేందుకు తరలివస్తున్నారు.

కీలక నేతగా పేరొందారు

ఎన్ కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయిన టెక్ శంకర్ మావోయిస్టు పార్టీలో కీలక నేతగా పేరొందారు. ఆంధ్రా-ఒడిశా బార్డర్ మావోయిస్టు పార్టీ ఇంచార్జిగా వ్యవహరించారు. ఆయుధాల తయారీ, కమ్యూనికేషన్ వంటి వాటిలో నిపుణులుగా గుర్తిం పొందారు. దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమంలో ఉన్న ఆయనకు పోలీసుల రికార్డుల్లో శంకర్, బాబు, శివగా పేర్లున్నాయి.

Next Story