గొప్ప మనసు చాటుకున్న శ్రీచరణి

by Muthe.Rajitha |   (  Updated:2025-11-09 10:13:38  IST  )

మహిళల వరల్డ్ కప్ విజయంలో కీలకపాత్ర పోషించిన తెలుగమ్మాయి శ్రీచరణి గొప్ప మనసు చాటుకుంది.

గొప్ప మనసు చాటుకున్న శ్రీచరణి
X

దిశ, వెబ్ డెస్క్ : మహిళల వరల్డ్ కప్ విజయంలో కీలకపాత్ర పోషించిన తెలుగమ్మాయి శ్రీచరణి గొప్ప మనసు చాటుకుంది. శ్రీచరణి తీసుకున్న నిర్ణయంపై ప్రస్తుతం ప్రశంసలు కురుస్తున్నాయి. ఇటీవల శ్రీచరణి ట్రైనింగ్ పొందిన కడప క్రికెట్ అకాడమీలో ఆమెకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీచరణిని అభినందిస్తూ కడప టీడీపీ అధ్యక్షుడు, కమలాపురం MLA రూ.10 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అయితే అదే అకాడమీలో ట్రైనింగ్ పొందుతున్న అండర్-14 క్రికెట్ టీమ్ ప్రోత్సాహానికి ఆ డబ్బులు కేటాయించాలని శ్రీచరణి ఎమ్మెల్యేను కోరారు. దీనికి ఎమ్మెల్యే కూడా ఆమోదం తెలపడంతో.. అకాడమీ సభ్యులు, అండర్-14 క్రికెటర్స్ హార్షం వ్యక్తం చేసారు. శ్రీచరణి చూపిన చొరవకు., గొప్ప మనసుకు నెట్టింట్లో ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story