- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ap News: చిరుత కలకలం.. భయాందోళనలో కొత్తపేట వాసులు
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం కొత్తపేట వాసులను చిరుత కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది..

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా(Nellore District) దుత్తలూరు మండలం కొత్తపేట వాసులను చిరుత(Cheetah) కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రాత్రి సమయంలో స్థానిక అటవీ ప్రాంతం నుంచి ఆహారం కోసం పరిసరాల్లో సంచరిస్తోంది. దీంతో చిరుత పాదముద్రలు(Footprints) కలకలం రేపాయి. అటు, ఇటూ తిరిగిన పాదముద్రలను స్థానికులు గమనించారు. దీంతో భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు కూడా భయపడిపోతున్నారు. పొలాలకు వెళ్లేందుకు రైతులు సైతం జంకిపోతున్నారు. చిరుత ఎప్పుడు దాడి చేస్తోందని పశువులు కాపరులు కూడా ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది చిరుత పాదముద్రలను పరిశీలించారు. చిరుతను బంధించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. చిరుత దొరికే వరకూ స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి సమయంలో ఒంటరిగా బయటకు రావొద్దని, పొలాలు వెళ్లే రైతులు జాగ్రత్తలు పాటించాలని అటవీ శాఖ సిబ్బంది తెలిపారు.






