- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > ఏపీ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > Tdp leaders: ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై ఎస్పీకి ఫిర్యాదు
Tdp leaders: ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై ఎస్పీకి ఫిర్యాదు
రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వల్ల తనకు ప్రాణ హాని ఉందని టీడీపీ నేతలు సాబీర్ ఖాన్, మాతంగి కృష్ణా ఆరోపించారు..

X
దిశ. నెల్లూరు: రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వల్ల తమకు ప్రాణ హాని ఉందని టీడీపీ నేతలు సాబీర్ ఖాన్, మాతంగి కృష్ణా ఆరోపించారు. ఈ మేరకు శ్రీధర్ రెడ్డిపై జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కనుసన్నల్లో ఎన్నో దారుణాలు జరిగాయని, తమను చంపాబోయారని వ్యాఖ్యానించారు. నాలుగు నెలల క్రితం ఇద్దరు టీడీపీ నేతలపై జరిగిన హత్యాయత్నం విషయం, ఐదుగురు టీడీపీ నేతలపై మోపిన దొంగ కేసు విషయంపై జిల్లా ఎస్పీని కలవడం జరిగిందని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా వాస్తవాలను పరిగణంలోకి తీసుకొని, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కనుసన్నల్లో జరిగిన దారుణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిందితులను శిక్షించాలని, దొంగ కేసుల నుంచి విముక్తి కలిగించాలని ఎస్పీని కోరినట్లు టీడీపీ నేతలు పేర్కొన్నారు.
Next Story






