TDP leader Malepati: చంద్రబాబు సీఎం అయితే మేలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-02-26 14:00:45  IST  )

రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిని చేసుకుంటే అన్ని వర్గాలు మంచి జరుగుతుందని కావలి టీడీపీ ఇంచార్జి మాలేపాటి సుబ్బానాయుడు పేర్కొన్నారు...

TDP leader Malepati: చంద్రబాబు సీఎం అయితే మేలు
X

దిశ,కావలి: రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును సీఎంగా చేసుకుంటేనే అన్ని వర్గాలకు మంచి జరుగుతుందని కావలి టీడీపీ ఇంచార్జి మాలేపాటి సుబ్బానాయుడు పేర్కొన్నారు. కొత్తపల్లి బీసీ, ఎస్సీ కాలనీల్లో ఇదేంఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో సుబ్బానాయుడు పాల్గొన్నారు. యువగళం టీ షర్టులను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయనను గ్రామస్తులు శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. ఇంటింటికి తిరుగుతూ రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా సుబ్బానాయుడు మాట్లాడుతూ యువగళం కార్యక్రమంలో పాల్గొనేందుకు యువకులు ఉత్సాహం చూపిస్తున్నారన్నారు. కావలి నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో పాదయాత్రలో పాల్గొనేందుకు యువకులు సిద్ధంగా ఉన్నారని సుబ్బానాయుడు తెలిపారు

Next Story