అరుదైన సంఘటన..! నెల్లూరు జిల్లాలో సముద్రం నుంచి బయటపడ్డ శివలింగం

by Ramesh Naini |

నెల్లూరు జిల్లాల సరిహద్దులోని గూడూరు సమీపంలో ఉన్న తూపిలిపాలెం బీచ్‌లో ఒక అరుదైన సంఘటన చోటుచేసుకుంది.

అరుదైన సంఘటన..! నెల్లూరు జిల్లాలో సముద్రం నుంచి బయటపడ్డ శివలింగం
X

దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరు జిల్లాల సరిహద్దులోని గూడూరు సమీపంలో ఉన్న తూపిలిపాలెం బీచ్‌లో ఒక అరుదైన సంఘటన చోటుచేసుకుంది. సముద్రంలో స్నానాలు చేస్తున్న పర్యాటకులకు అకస్మాత్తుగా ఒక శివలింగం దర్శనమిచ్చింది. నీటిలో కనిపించిన ఆ శివలింగాన్ని యాత్రికులు ఎంతో కష్టపడి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని ఆ శివలింగానికి భక్తిశ్రద్ధలతో అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. సముద్రంలో అకస్మాత్తుగా శివలింగం బయటపడటంతో అక్కడున్న వారంతా ఆనందం వ్యక్తం చేస్తూ, ఆ అద్భుత దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో బంధిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Next Story