స్పా ముసుగులో వ్యభిచారం.. పది మంది యువతుల అరెస్ట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-07 16:58:40  IST  )

స్పా ముసుగులో వ్యభిచారం చేస్తున్న పది మంది యువతులు, ఓ విటుడిని పోలీసులు అరెస్ట్ చేశారు...

స్పా ముసుగులో వ్యభిచారం.. పది మంది యువతుల అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: స్పా ముసుగులో వ్యభిచారం చేస్తున్న పది మంది యువతులు, ఓ విటుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నెల్లూరులో జరిగింది. మూడు స్పా సెంటర్లపై పోలీసులు దాడి చేయడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. నిప్పు సెంటర్ లో ఎవరీ డే సెలూన్ స్పా సెంటర్ పై చేసిన దాడిలో ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. స్పా నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. బాలాజీ నగర్ సమీపం యూనిక్స్ సెలూన్ స్పాలో ముగ్గురు యువతులతో పాటు విటుడిని అరెస్ట్ చేశారు. నిర్వహకుడు సుధీర్ పైనా కేసు నమోదు చేశారు. రామలింపురంలో వీఐపీ స్పా సెంటర్ పై దాడి చేసిన పోలీసులు.. ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. పోలీసులు దాడుల సమచారంలో పలు స్పా సెంటర్లకు తాళాలు వేసి నిర్మాహకులు పారిపోయారు.

Next Story