- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: కాకాణి నివాసానికి పోలీసులు.. మూడోసారి నోటీసులు..!
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు..

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Former Minister Kakani Govardhan Reddy) కోసం పోలీసులు గాలిస్తున్నారు. నెల్లూరులో జరిగిన మైనింగ్ అక్రమం కేసులో ఆయనకు స్వయంగా నోటీసులిచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తాజాగా నెల్లూరు పోలీసులు హైదరాబాద్ వెళ్లారు. అక్కడ కాకాని నివాసానికి వెళ్లారు. అయితే కాకాణి లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించారు. నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకూ కాకాణికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు మూడుసార్లు ప్రయత్నం చేశారు. హైదరాబాద్‌తో పాటు నెల్లూరులో ఆయన నివాసానికి వెళ్లారు. ఆయన అచూకీ లేకపోవంతో ఇంటి గోడలకు నోటీసులు అంటించారు. కానీ కాకాణి మాత్రం విచారణకు హాజరుకాలేదు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో కాకాణి ప్రయత్నం చేస్తున్నారు. ఈమేరకు మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. అయితే కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. విచారణ గురువారానికి వాయిదా వేసింది.
మరోవైపు మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించిన కాకాణి.. కేసులకు భయపడేది లేదన్నారు. 24 గంటల సమయం ఇస్తే విచారణకు హాజరవుతానని తెలిపారు.






