- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెల్లూరు మేయర్ పై అవిశ్వాస తీర్మానం! కలెక్టర్ వద్దకు కార్పొరేటర్లు
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ (Nellore Municipal Coporation) రాజకీయాలు (Politics) రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ (Nellore Municipal Coporation) రాజకీయాలు (Politics) రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు 40 మంది కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్ష్ శుక్లాను కలవనున్నారు. రాష్ట్ర మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కార్పొరేటర్లు ఆదివారం సమావేశమయ్యారు. నెల్లూరు కార్పొరేషనులో మేయర్ స్రవంతి, ఆమె భర్త అక్రమాలు పెరిగాయని వారికి ఫిర్యాదు చేశారు. వైసీపీ నుంచి ఎన్నికైన స్రవంతిని మేయర్ పదవి నుంచి తొలగించాలని కలెక్టరును కోరనున్నట్లు కార్పొరేటర్లు తెలిపారు.
మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ ఫోర్జరీ సంతకాల కేసులో జైలుకెళ్లి వచ్చారని.. దంపతుల చేతివాటం వల్ల ఫైళ్లు కదలటం లేదని కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. అందుకే వారిపై అవిశ్వాస తీర్మానానికి ముందుకొచ్చామంటున్నారు. అయితే మేయర్ పీఠం కోసం టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి పన్నిన వ్యూహంలో భాగమే అవిశ్వాస తీర్మానంగా తెలుస్తోంది. ప్రస్తుతం మున్సిపాలిటీలో టీడీపీకి 43, వైసీపీకి 14 ఓట్లు ఉన్నాయి. దీంతో ఒకవేళ అవిశ్వాస తీర్మాణం అనివార్యమైతే నెల్లూరు మేయర్ పీఠం టీడీపీ కైవసం కావడం లాంఛనప్రాయం అనే అభిప్రాయాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
జేసీకి అవిశ్వాస తీర్మాన నోటీసులు అందజేత
నెల్లూరు జేసీ వెంకటేశ్వర్లుకు అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసును నలభై మంది కార్పొరేటర్లు అందజేశారు. స్రవంతిని మేయర్ పదవి నుంచి తొలగించి కొత్త మేయరును ఎన్నుకోవాలని కోరారు.






