Nellore | రాపూరు రోడ్డులో చీలిక.. మరమ్మతులు

by Thanuru Gopichand |

రాపూరు రోడ్డులోని (Rapur Road) కల్వర్టు వద్ద రోడ్డు చీలడంతో అధికారులు దానికి మరమ్మతులు చేశారు.

Nellore | రాపూరు రోడ్డులో చీలిక.. మరమ్మతులు
X

దిశ, వెబ్ డెస్క్ : రాపూరు రోడ్డులోని (Rapur Road) కల్వర్టు వద్ద రోడ్డు చీలడంతో అధికారులు దానికి మరమ్మతులు చేశారు. వివరాల్లోకి వెళ్తే పొదలకూరు మండలం డేగపూడి రాజుపాలెం వద్ద కల్వర్టు కూలి రోడ్డు చీలింది. దీంతో రాపూరు - పొదలకూరు (Podalakur) మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇటీవల కురిసిన వర్షాలకు కల్వర్టు కొంత మేర దెబ్బతినగా.. మంగళవారం పూర్తిగా కుప్పకూలి రోడ్డు చీలిపోయి గుంతలా (Road Damage) ఏర్పడింది. విషయం తెలుసుకున్న సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. సమాచారం అందుకున్న ఆర్ అండ్ బి అధికారులు, పొదలకూరు సబ్ ఇన్స్ పెక్టర్ హనీఫ్, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

Next Story