- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, నెల్లూరు: కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఓ వ్యక్తి కత్తితో హల్‌చల్ చేశాడు. దీంతో చుట్టుపక్కల వాళ్లు భయంతో పరుగులు తీశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో చిన్నబజారు పోలీసులు కలెక్టరేట్ వద్దకు చేరుకుని ఆ వ్యక్తి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితుడు కోవూరు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో పోలీస్‌స్టేషన్ వద్దకు ఆ వ్యక్తి తండ్రి చేరుకున్నారు. తమ కుమారుడికి మతిస్థిమితం లేదని, చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పడంతో హల్ చల్ చేసిన వ్యకిని తండ్రితో పంపించారు.
Next Story






