Giridhar Reddy: వైసీపీ రాక్షస పాలనకు కాలం చెల్లింది

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-03-24 15:14:46  IST  )

2024 ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్షమని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.

Giridhar Reddy: వైసీపీ రాక్షస పాలనకు కాలం చెల్లింది
X

దిశ, నెల్లూరు: 2024 ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వైసీపీ నుంచి గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ 2024వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన ధ్యేయమని వెల్లడించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి భారీ మెజారిటీతో టీడీపీ అభ్యర్థిని గెలిపించి, చంద్రబాబుకు బహుమతిగా అందజేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలనకు కాలం చెల్లిందని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

చంద్రబాబు మాట్లాడుతూ నెల్లూరులో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి లాంటి ప్రజాదరణ కలిగిన నాయకుడు టీడీపీలో చేరడం శుభపరిణామమని అన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజా నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న గిరిధర్ రెడ్డి టీడీపీలోకి రావడం తమ పార్టీకి బలం చేకూరిందని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

Tirupati Janasena: ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసీపీని గద్దె దించుతాం

Next Story