- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > ఏపీ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > Apsrtc: అరుణాచలం, శ్రీశైలం యాత్రికులకు ఆర్టీసీ ప్రత్యేక సదుపాయాలు
Apsrtc: అరుణాచలం, శ్రీశైలం యాత్రికులకు ఆర్టీసీ ప్రత్యేక సదుపాయాలు
by Vemula.Srinu Prasad |
శ్రీశైలం, అరుణాచలం వెళ్లే యాత్రికులకు ఆర్టీసీ ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తోందని కావలి ఆర్టీసీ డిపో మేనేజర్ రాపూరు శ్రీనివాసులు పేర్కొన్నారు...

X
దిశ, కావలి: శ్రీశైలం, అరుణాచలం వెళ్లే యాత్రికులకు ఆర్టీసీ ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తోందని కావలి ఆర్టీసీ డిపో మేనేజర్ రాపూరు శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అరుణాచలం గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు జూన్ మూడో తేదీన బయలుదేరుతుందని, 1400 రూపాయలు చార్జితో ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అరుణాచలం వెళ్లే యాత్రికులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టికెట్ ముందుగా రిజర్వ్ చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా శ్రీశైలం వెళ్లే యాత్రికులు టిక్కెట్టు ముందుగా టికెట్ రిజర్వేషన్ చేయించుకుంటే తిరుమల గ్రహాలు దర్శనం టికెట్ కూడా అందజేస్తామని పేర్కొన్నారు. ప్రయాణికులు కోరితే ప్రత్యేక ప్యాకేజీలో తీర్థయాత్రలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయిస్తామని తెలిపారు.
Next Story






