- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CID Custody: కాకాణికి ప్రశ్నల వర్షం
రెవెన్యూ కార్యాలయంలో రికార్డుల తారుమారు కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డిని సీఐడీ కస్టడీకి తీసుకున్నారు...

దిశ, వెబ్ డెస్క్: రికార్డులు తారుమారు కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Former Minister Kakani Goverdhan Reddy)పై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు సంబందించిన కేసులో ఆయన్ను గుంటూరు(Guntur) సీఐడీ పోలీసులు తాజాగా కస్టడీకి తీసుకున్నారు. నెల్లూరు పోలీసు శిక్షణా కేంద్రంలో కాకాణిని ప్రశ్నిస్తున్నారు. ‘‘రికార్డుల తారుమారు ఎలా జరిగింది?. అసలు ఎందుకు చేశారు?. అంతఅవసరం ఏంటి?, ఎంతమంది ఉన్నారు. తారుమారు చేసిన నిందితులకు, తమకు సంబంధమేంటి..?’’ అనే ప్రశ్నలు వేస్తున్నారు. అయితే సీఐడీ పోలీసుల ప్రశ్నలకు మౌనంతో కాకాణి సమాధానం చెబుతున్నట్టు తెలుస్తోంది.
కాగా నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎమ్మార్వో కార్యాలయంలో భూ రికార్డులు తారుమారయ్యారు. దీంతో సీఐడీ పోలీసులు(CID Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే ఈ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి 14వ నిందితుడిగా గుర్తించారు. ఇప్పటికే వేరే కేసులో రిమాండ్ లో ఉన్న ఆయన్ను నెల్లూరు రెండో మేజిస్ట్రేట్ కోర్టు(Nellore Second Magistrate Court) ఎదుట వర్చువల్‌గా పర్చారు. ఈ కేసులోనూ ఆయనకు న్యాయమూర్తి ఆగస్టు 7 వరకూ రిమాండ్ విధించారు. ఇప్పటికే ఆయన పలు కేసుల్లో నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో కోర్టు అనుమతితో కాకాణిని ఆదివారం కస్టడీకి తీసుకున్నారు. రికార్డుల తారుమారు వెనుక ఇంకా ఎవరెవరున్నారో అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.






