సీఎం పాలనా దక్షతతో రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ

by Thanuru Gopichand |

సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) పాలనా దక్షతతో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy) అన్నారు.

సీఎం పాలనా దక్షతతో రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) పాలనా దక్షతతో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy) అన్నారు. సతీమణి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో (Vemireddy Prashanti Reddy) కలిసి ఆయన నెల్లూరులోని తమ నివాసంలో సోమవారం మాట్లాడారు. సీఐఐ సమ్మిట్‌ (CII Summit) ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వచ్చాయన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఇందులో కీలకంగా వ్యవహరించారన్నారు. రెండు రోజుల్లోనే 613 ఒప్పందాలు, రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడుల సాధన జరిగిందన్నారు. 16 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఏర్పడిందన్నారు. సీఐఐ సమ్మిట్‌ విజయవంతంతో ఏపీ వైపు ప్రపంచం చూస్తోందన్నారు. జిల్లాలో ప్రఖ్యాత కంపెనీల పెట్టుబడులు రానున్నాయని పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో పారిశ్రామిక తిరోగమనం జరిగితే, నేడు పరిశ్రమల రాకతో రాష్ట్రం, జిల్లా సమగ్రాభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ప్రజల తరఫున సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌ కు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు.

Next Story