- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆరుగంటలు నాపై ఎక్కువ ప్రేమ చూపారు: పోలీస్ విచారణపై అనిల్ సంచలన వ్యాఖ్యలు
ఆరుగంటల పాటు పోలీసులు తనపై ప్రేమ ఎక్కువ చూపారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు..

దిశ, వెబ్ డెస్క్: ఆరుగంటల పాటు పోలీసులు తనపై ప్రేమ ఎక్కువ చూపారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్(Former Minister Anil Kumar Yadav) అన్నారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి(Mla PrashantiReddy)పై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి(Former MLA Prasanna Kumar Reddy) చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయన్ను నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో ప్రశ్నించారు. ఈ విచారణ అనంతరం అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తనను 36 ప్రశ్నలు అడిగారని, అందులో తెలిసిన వాటికి మాత్రమే సమాధానం చెప్పానని క్లారిటీ ఇచ్చారు. ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు నవ్వానని, అందుకే తనపై కేసు పెట్టారని ఆరోపించారు. టీడీపీ(Tdp) నేతల శునకానందం కోసమే ఆరు గంటల పాటు విచారించారని విమర్శలు చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను సమర్థిస్తానని చెప్పిన్నట్లు తెలిపారు. కేసుకు సంబంధం లేని ప్రశ్నలు అడగలేదని అనిల్ కుమార్ పేర్కొన్నారు.






