- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూరియా పంపిణీపై అపోహలు వద్దు: కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
యూరియా పంపిణీ విషయంలో ఎటువంటి అపోహలు వద్దని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : యూరియా పంపిణీ విషయంలో ఎటువంటి అపోహలు వద్దని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. యూరిత కొరత ఉందంటూ దుష్ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. కొందరు పనిగట్టుకొని మరీ యూరియా కొరతపై వదంతులు వ్యాప్తి చేస్తున్నారన్నారు. అటువంటి ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదన్నారు. రైతులు యూరియా పంపిణీ విషయంలో ఎటువంటి అనుమానాలను పెంచుకోవద్దన్నారు. అపోహలకు గురై ఆందోళన పడొద్దని కోరారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి రైతుకి యూరియా పంపిణీ అయ్యేలా చూస్తామని హామీనిచ్చారు. యూరియా పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలను తీసుకుంటామని స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి రైతుకు యూరియా చేరేలా చూసేందుకు అధికారులతో ఇప్పటికే చర్చిస్తున్నామని వెల్లడించారు. రైతులు సంయమనం పాటించాలని, యూరియా పంపిణీ విషయంలో అధికారులకు సహకరించాలని అన్నారు.






