Nellore: ఆనం మద్దతు కోరిన ఏపీజేఏసీ అమరావతి టీమ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-05-14 13:16:59  IST  )

ఏపీజేఏసీ అమరావతి మూడవ దశ ఉద్యమ కార్యచరణ ప్రణాళిక ప్రారంభించింది. ఇందులో భాగంగా సమస్యలు ప్రభుత్వానికి చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ...

Nellore: ఆనం మద్దతు కోరిన ఏపీజేఏసీ అమరావతి టీమ్
X

దిశ, నెల్లూరు సిటీ: ఏపీజేఏసీ అమరావతి మూడవ దశ ఉద్యమ కార్యచరణ ప్రణాళిక ప్రారంభించింది. ఇందులో భాగంగా సమస్యలు ప్రభుత్వానికి చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఆదివారం మాజీ మంత్రి, వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డికి జేఏసీ అమరావతి నెల్లూరు జిల్లా శాఖ వినతిపత్రం అందజేసింది. ఏపీ జేఏసీ అమరావతి నెల్లూరు జిల్లా శాఖ అసోసియేట్ చైర్మన్ ఈవీఎం శరత్ బాబు ఆధ్వర్యంలో సంతపేటలోని ఆనం నివాసంలో ఆయనను కలిసి సమస్యను వివరించి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా శరత్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పట్ల నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. 70 రోజులుగా ఉద్యమం చేపడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని శరత్ బాబు మండిపడ్డారు.

Next Story