విజయవాడ సమీపంలో కల్తీ మద్యం డంప్ కలకలం.. ఇది కూడా ఆయనదే..?

by Vemula.Srinu Prasad |

విజయవాడ సమీపంలో కల్తీ మద్యం డంప్ కలకలం రేగింది..

విజయవాడ సమీపంలో కల్తీ మద్యం డంప్ కలకలం.. ఇది కూడా ఆయనదే..?
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో నకిలీ మద్యం(Fake alcohol) తయారీ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు అయింది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకూ 13 మంది అరెస్ట్ అయ్యారు. మరో ముగ్గురు కీలకంగా ఉన్నారు. దీంతో వారికోసం ఎక్సైజ్ శాఖ అధికారులు ముమ్మర వేట సాగించారు. అలాగే అసలు సూత్రదారుల కోసం తీగలాగుతున్నారు. లోతుగా మరింత విచారణ జరుపుతున్నారు.

ఈ విచారణలో నిందితుల సమాచారంతో సోమవారం విజయవాడ(Vijayawada) సమీపంలోని ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam)లో తనిఖీలు నిర్వహించారు. గోడౌన్‌లో నిల్వ చేసిన మద్యం డంప్‌(Liquor dump)ను స్వాధీనం చేసుకున్నారు. స్పిరిట్ డ్రమ్ములు, ఖాళీ బాటిళ్లను సీజ్ చేశారు. అయితే ఈ డంప్ సైతం జనార్ధన్‌గౌడ్‌కు చెందినదిగా గుర్తించారు. ములకలచెరువులో లభ్యమైన డంప్ వ్యవహారంలోనూ జనార్ధన్‌గౌడ్ కీలక నిందితుడిగా ఉన్నారు. తంబళ్లపల్లి టీడీపీ ఇంచార్జ్ జయచంద్రారెడ్డి సన్నిహితుడే జనార్ధన్‌గౌడ్. ప్రస్తుతం పరారీలో ఉండటంతో ఆయన్ను పట్టుకునేందుకు గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు చెందిన గోడౌన్లు, దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరిన్ని సోదాలు సైతం జరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.

Next Story