- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP News : ఇక ఎమ్మెల్యేలు ప్లే గ్రౌండ్స్ లోకి
ఏపీ ప్రభుత్వం(AP Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వం(AP Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిరోజూ ప్రజాసమస్యలు, సభలు, సమీక్షా సమావేశాలతో బిజీగా ఉండే ప్రజాప్రతినిధులకు ఆటవిడుపు ఇవ్వనుంది కూటమి సర్కార్. ఎమ్మెల్యేలకు, మంత్రులకు క్రీడా పోటీలు(Sports), సాంస్కృతిక కార్యక్రమాలు(Cultural Activities) నిర్వహించాలని నిర్ణయించింది. ఈనెల 18, 19, 20 తేదీల్లో ప్రజాప్రతినిధులకు రాజధాని అమరావతిలో ఈ పోటీలు నిర్వహించనున్నారు. మహిళా నాయకురాళ్లకు బ్యాడ్మింటన్, త్రోబాల్, టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించనుండగా.. పురుషు నేతలకు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించనున్నారు.
ఈ పోటీల్లో అందరూ పాల్గొనాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు(Speaker Ayyanna Patrudu) మంగళవారం అసెంబ్లీలలో వెల్లడించారు. ఇందుకోసం చీఫ్ విప్, విప్ లకు తమ పేర్లు ఇవ్వాలని అన్నారు. ఆయా పోటీలకు ఐఏఎస్, హైకోర్ట్ జడ్జ్ లను న్యాయ నిర్ణేతలుగా ఆహ్వానించనున్నట్టు పేర్కొన్నారు. కాగా ఇంతవరకు విద్యార్థులకు, కొన్ని సందర్భాలలో ఉద్యోగులకు ఇలాంటి ఆటల పోటీలు నిర్వహించి, వాటికి బహుమతి ప్రధానం చేయడానికి రాజకీయనాయకుల చేత బహుమతులు ఇప్పించేవారు. ఇప్పుడు రాజకీయ నాయకులు గ్రౌండ్ లోకి దిగి పోటీ పడి ఆడటం చూస్తాం.






