స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం.. శంషాబాద్‌కు తిరుగు పయనం

by Vemula.Srinu Prasad |

స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది..

స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం.. శంషాబాద్‌కు తిరుగు పయనం
X

దిశ, వెబ్ డెస్క్: స్పైస్ జెట్ విమానం(SpiceJet plane)లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని పైలట్(Pilot) తిరిగి శంషాబాద్(Shamshabad) తీసుకెళ్లిపోయారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి స్పైస్ జెట్ విమానం ఈ రోజు ఉదయం బయల్దేరింది. మరికాసేపట్లో తిరుపతికి చేరుకుంటుందనే సమయంలో విమానంలో సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించారు. ఫ్లైట్‌ను వెంటనే శంషాబాద్‍కు తీసుకెళ్లిపోయారు. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. తిరుపతి వెళ్లాల్సిన ఫ్లైట్ తిరిగి శంషాబాద్ చేరుకోవడంతో ఒక్కసారిగా ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ ఫ్లైట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Next Story