22, 23 తేదీల్లో ఎమ్మెల్యేలకు ప్రత్యేక శిక్షణ

by Thanuru Gopichand |

రాష్ట్ర శాసనసభా గౌరవం పెంచేలా ఈసారి అసెంబ్లీ నిర్వహణ ఉంటుందని ప్రభుత్వ చీఫ్‌ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రకటించారు.

22, 23 తేదీల్లో ఎమ్మెల్యేలకు ప్రత్యేక శిక్షణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర శాసనసభా గౌరవం పెంచేలా ఈసారి అసెంబ్లీ నిర్వహణ ఉంటుందని ప్రభుత్వ చీఫ్‌ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రకటించారు. అందుకోసమే ఈనెల 22, 23 తేదీల్లో ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు కూడా నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో విప్‌లు అందరితో సమావేశం అనంతరం మీడియాలో మాట్లాడారు. అవగాహన సదస్సులకు తొలి రోజు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, తర్వాతి రోజు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారని వెల్లడించారు. అందుకు సంబంధించి శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకునేలా సభ్యులందర్నీ సమాయత్తం చేయాలని విప్‌లకు సూచించామని, శాసనసభ విధానాలు, వ్యవహారాలు, నిబంధనలు, నియంత్రణలు, సంప్రదాయాలను సభ్యులకు వివరిస్తామని జీవీ మీడియాకు తెలిపారు.

Next Story