AP Govt:జంగారెడ్డిగూడెంలో మరణాలపై స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్.. ఉత్తర్వులు జారీ

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-19 12:54:34  IST  )

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Government) కీలక నిర్ణయం తీసుకుంది.

AP Govt:జంగారెడ్డిగూడెంలో మరణాలపై స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్.. ఉత్తర్వులు జారీ
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం కల్తీ మద్యం మరణాలపై అధికారులతో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కల్తీమద్యం అనుమానాల నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించిన అంశాలపై లోతుగా దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్రమంలో ఏలూరు SP కిశోర్ నేతృత్వంలో ఏర్పాటు కానున్న టాస్క్‌ఫోర్స్‌లో.. ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ప్రభుకుమార్, కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ HOD సభ్యులుగా ఉండనున్నారు. 2022 మార్చిలో జంగారెడ్డి గూడెం పరిసరాల్లో కల్తీ మద్యం వల్ల 20 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులపై అధ్యయనం చేసి.. అసహజ మరణాలకు బాధ్యులను గుర్తించాలని తాజాగా ప్రభుత్వం(AP Government) అధికారులను ఆదేశించింది.

Next Story