- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: త్వరలోనే ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు
మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజకీయ దుమారం రేగుతున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్, ఇండియా కూటమి అనుసరిస్తున్న వ్యతిరేక వైఖరిని ప్రజలకు వివరించేందుకు త్వరలోనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: మహిళా రిజర్వేషన్ బిల్లు(Women Reservation Bill)పై రాజకీయ దుమారం రేగుతున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు(Ap Cm Chandrababu) కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్(Congress), ఇండియా కూటమి(India Kutami) అనుసరిస్తున్న వ్యతిరేక వైఖరిని ప్రజలకు వివరించేందుకు త్వరలోనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Assembly Special Sessions) నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. కూటమి నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడుతూ 2023లో ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ చారిత్రాత్మక చట్టాన్ని తీసుకువస్తే, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి దీనిని అడ్డుకుంటోందని విమర్శించారు. ఈ వాస్తవాలను చట్టసభ వేదికగా ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ఈ సమావేశాలు ఉండనున్నాయని చంద్రబాబు తెలిపారు.
మూడు నగరాల్లో భారీ బహిరంగ సభలు
మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై ఇండియా కూటమి ద్వంద్వ నీతిని ఎండగట్టడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నేతలకు సీఎం చంద్రబాబు సూచించారు. అంతేకాదు ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ వైఖరిని వివరించాలని దిశానిర్దేశం చేశారు. మహిళా రిజర్వేషన్ల పట్ల కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటి చెప్పాలని, నిడదవోలు తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ముగ్గురు నేతలతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు
మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇండియా కూటమి వైఖరిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తున్నట్లు నేతలకు సూచించారు. ఈ కమిటీ రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలను పర్యవేక్షించనుందని తెలిపారు. కమిటీ సభ్యులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాధవ్, జనసేన నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ పని చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు.
ఈ కమిటీ ఆధ్వర్యంలో..
ఈ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని మహిళా లోకానికి రిజర్వేషన్ బిల్లు ప్రాముఖ్యతను, ప్రతిపక్షాల అడ్డంకులను వివరించేలా కార్యాచరణ రూపొందించనున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. కాంగ్రెస్ మినహా మిగిలిన పక్షాలన్నీ బిల్లుకు మద్దతు ఇచ్చాయని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అడ్డుపడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.






