యాదాద్రిలో నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు

by Malleboina Mahesh |

యాదాద్రిలో నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు! లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న ఏపీ సీఎం సతీమణి.

యాదాద్రిలో నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రిని ఏపీ ముఖ్యమంత్రి నారా భువనేశ్వరి సందర్శించారు.కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. గర్భాలయంలోని స్వయంభూ స్వామివారిని దర్శించుకున్న భువనేశ్వరి, స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు స్వామి వారి శేష వస్త్రం, తీర్థప్రసాదాలను అందజేశారు. లోకకల్యాణార్థం, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల శ్రేయస్సు కోరి ఈ పూజలు చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వేసవి సెలవుల కారణంగా భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో, ఆమె పర్యటన దృష్ట్యా పోలీసులు ఆలయ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భువనేశ్వరి వెంట పలువురు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Next Story