- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2029లో జగనన్న సీఎం కావాలని.. శబరిమలలో ప్రత్యేక పూజలు
by Ramesh Naini |
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ శబరిమలలో పలువురు అయ్యప్ప మాల ధరించిన స్వాములు ప్రత్యేక పూజలు చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ శబరిమలలో పలువురు అయ్యప్ప మాల ధరించిన స్వాములు ప్రత్యేక పూజలు చేశారు. రేగిడి మండలం లచ్చన్నవలస గ్రామానికి చెందిన 20 మంది భక్తులు 41 రోజుల కిందట అయ్యప్ప దీక్ష ప్రారంభించారు. దీక్ష ముగియడంతో శబరిమల యాత్రకు వెళ్లిన వీరంతా అక్కడ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ ఆలయానికి చేరుకున్నారు. జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలని అయ్యప్పను ప్రార్థించారు. అలాగే తాజాగా వైఎస్ జగన్ సీఎం కావాలని కోరుతూ అయ్యప్ప భక్తులతో కలిసి.. జగన్ ఫ్లెక్సీతో తిరువూరు ఎస్టీ సెల్ అధ్యక్షుడు భూక్యా రాము కొండకు పాదయాత్రగా వెళ్లారు. జగనన్న మళ్లీ సీఎం అయితేనే రాష్ట్రం బాగుంటుందని, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని రాము ఆకాంక్షించారు.
Next Story






