Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీ కేసులో ప్రత్యేక పోలీస్ బృందాలు

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-15 08:12:12  IST  )

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ కేసు(Vallabhaneni Vamsi Case) విచారణకు, పరారీలో ఉన్న నిందితుల గాలింపుకు ప్రత్యేక పోలీస్ బృందాలు(Special police teams) ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వంశీ మొబైల్ ఫోన్(Mobile phone)కోసం పోలీసుల ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీ కేసులో ప్రత్యేక పోలీస్ బృందాలు
X

దిశ, వెబ్ డెస్క్ : గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ కేసు(Vallabhaneni Vamsi Case) విచారణకు, పరారీలో ఉన్న నిందితుల గాలింపుకు ప్రత్యేక పోలీస్ బృందాలు(Special police teams) ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వంశీ మొబైల్ ఫోన్(Mobile phone)కోసం పోలీసుల ప్రయత్నాలు ముమ్మరం చేశారు. హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీసుల సహకారంతో వంశీ ఇంట్లో సోదాలు చేపట్టాలని నిర్ణయించారు. వంశీ ఫోన్ లో కీలక ఆధారాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం మరో బృందం గాలింపు చేపట్టింది.

ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులు ఉండగా. వంశీ, లక్ష్మీపతి, రాజేందర్ లను పోలీసులు రిమాండ్ చేశారు. పరారీలో ఉన్న మిగతా తొమ్మిది మంది నిందితుల కోసం పోలీస్ ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. గన్నవరం, విజయవాడలో వంశీ అనుచరులపై పోలీసులు డేగ కన్ను వేశారు. కాగా తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు ఇప్పటికే ప్రకటించారు. గన్నవరం టీడీపీ కార్యాలయం విధ్వంసం కేసులో ఫిర్యాదు దారుడు సత్యవర్ధన్‌ను వల్లభనేని వంశీమోహన్‌ కిడ్నాప్‌ చేశాడు. ఈకేసులో కీలక ఆధారాలు పోలీసులు సంపాదించారు.

కోర్టు కాంప్లెక్స్ వద్దకు సత్యవర్ధన్‌ను తీసుకువచ్చిన వాహనం, అందులో వచ్చిన వారి వివరాలు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు సేకరించారు. సత్యవర్ధన్‌ను నగరంలో ఎక్కడెక్కడ తిప్పారనే అంశంపై కూడా సాంకేతిక ఆధారాలు సేకరించారు. వంశీ అనుచరులే ఆ రోజు సత్యవర్ధన్‌ను తీసుకువచ్చారని నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో వల్లభనేని వంశీమోహన్‌కు విజయవాడ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బెజవాడ సబ్ జైలులో వంశీని కలిసిన భార్య పంకజశ్రీ కలుసుకుంది. వంశీ సహా అరెస్టయిన లక్ష్మీపతి, రాజేందర్ లను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అటు వంశీ న్యాయవాదులు కూడా విజయవాడ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు.

వంశీకి ప్రాణహానీ ఉంది

విజయవాడ సబ్ జైలులో వల్లభనేని వంశీకి కలిసిన ఆయన భార్య పంకజశ్రీ తన భర్తకు జైలులో ప్రాణహాని ఉందని మీడియాతో వాపోయింది. ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ విజయవాడ సబ్ జైలులో వంశీకి ప్రాణహాని ఉందని, ఆయనను అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. వంశీకి టెయిల్‌బోన్ సర్జరీ జరిగిందని, కోవిడ్ తర్వాత శ్వాస సమస్య ఉందని..ఆయనను 22 గంటలు ఒక పనిష్‌మెంట్‌లా ఒక షెల్‌లో పెట్టి ఇబ్బంది పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.

వెన్నునొప్పితో వంశీ బాధపడుతున్నారని.. నా భర్తను మానసికంగా కుంగదీస్తున్నారని ఆరోపించారు. వంశీ ఉన్న బారక్ లో 60 సీసీ కెమెరాలు పెట్టారని.. నా భర్త హెల్త్ బాగుందంటూ వైద్యులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ వ్యవహారంపై కోర్టుకు వెళ్తామని.. కేవలం రూ. 20,000 కోసం తప్పుడు కేసులు పెట్టి టార్చర్ పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్ ఫోన్ చేసి పరామర్శించారని.. ధైర్యంగా ఉండాలని చెప్పారని.. వచ్చే వారం కలుస్తానని జగన్ చెప్పారని పంకజశ్రీ వెల్లడించారు.

Next Story