- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పొందూరు ఖద్దర్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు
పొందూరు ఖద్దర్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు...

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా పొందూరు ఖద్దర్(Pandur Khaddar)కు జియో గ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్(Geographical Indication Tag) అనౌన్స్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే. అయితే జీఐ ట్యాగ్ ద్వారా వచ్చే లాభం వీవర్స్‌కు అందజేస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Union Minister Rammohan Naidu) తెలిపారు. పొందూరు ఖద్దర్ రాష్ట్ర ఆస్తి అని, పొందూరు ఖద్దర్‌కు అంతర్జాతీయంగా డిమాండ్ పెంచుతామని ఆయన తెలిపారు. పొందూరు ఖద్దర్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు వచ్చేలా కృషి చేస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో చాలా రకాల మిల్లు వస్త్రాలు వస్తున్నప్పటికీ పొందూరు ఖాదీకి ప్రత్యేకత ఉందని తెలిపారు. పత్తి నుంచి దారం తీసి వస్త్రాన్ని చేతితో తయారు చేస్తారని చెప్పారు. పొందూరు ఖద్దర్ ను గాంధీజీ సైతం మొచ్చుకున్నారని పేర్కొన్నారు. తెలుగువారి హుందాతనాన్ని సైతం పొందూరు ఖద్దర్ పెంచిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.






