- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా ఆరోపణలు.. స్పందించిన స్పెషల్ సీఎస్ అజయ్ జైన్
డీఎస్సీ-2025 నియామకాల్లో స్పోర్ట్స్ కోటా అమలుపై వస్తున్న ఆరోపణలను క్రీడాశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ తీవ్రంగా ఖండించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: డీఎస్సీ-2025 నియామకాల్లో స్పోర్ట్స్ కోటా అమలుపై వస్తున్న ఆరోపణలను క్రీడాశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ తీవ్రంగా ఖండించారు. క్రీడా కోటా ఎంపిక ప్రక్రియ అంతా నిబంధనల ప్రకారం, పారదర్శకంగా జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాకు వివరాలు తెలిపారు. 2024 డిసెంబర్‌లో ప్రభుత్వం ప్రకటించిన కొత్త స్పోర్ట్స్ పాలసీ ప్రకారం ఉద్యోగ నియామకాల్లో క్రీడా కోటాను 2% నుంచి 3 శాతానికి పెంచారు. ఈ కోటా మొత్తం 65 క్రీడలకు వర్తిస్తుంది. డీఎస్సీ-2025లో మొత్తం 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా, అందులో 3% రిజర్వేషన్ కింద 431 పోస్టులు స్పోర్ట్స్ కోటాకు కేటాయించారు.
సర్టిఫికెట్ల జారీపై స్పష్టత
3,600 మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా, స్టేట్ లెవల్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి 382 మందిని మెరిట్ లిస్టుకు ఎంపిక చేసింది. ఇందులో ఇంకా 39 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్పోర్ట్స్ సర్టిఫికెట్లను క్రీడాశాఖ లేదా ‘శాప్’ జారీ చేయవని, కేవలం ఆయా క్రీడా ఫెడరేషన్లు, అసోసియేషన్లు, వర్సిటీలు మాత్రమే ఇస్తాయని అజయ్ జైన్ తేల్చి చెప్పారు. అభ్యర్థుల పత్రాలను అన్ని కోణాల్లో పకడ్బందీగా పరిశీలించామన్నారు. ఎంపికపై వచ్చిన 192 ఫిర్యాదులను పూర్తిగా పరిష్కరించామని, హైకోర్టులో నమోదైన 69 కేసుల్లో ఇప్పటికే 3 కొట్టివేయబడ్డాయని ఆయన వివరించారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, అర్హులైన వారికే న్యాయం జరిగిందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.






