Yoga Andhra-2025: ప్రపంచ రికార్డు సృష్టించేలా యోగాంధ్ర.. ఆ పార్క్‌లో ప్రత్యేక ఏర్పాట్లు

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-20 05:53:44  IST  )

ఏపీ(Andhra Pradesh)లో కూటమి ప్రభుత్వం(AP government) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు

Yoga Andhra-2025: ప్రపంచ రికార్డు సృష్టించేలా యోగాంధ్ర.. ఆ పార్క్‌లో ప్రత్యేక ఏర్పాట్లు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో కూటమి ప్రభుత్వం(AP government) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. అంతర్జాతీయ యోగా డే(జూన్ 21) సందర్భంగా నిర్వహించే ‘‘యోగాంధ్ర కార్యక్రమం’’(Yoga Andhra-2025) రికార్డు కోసం ప్రపంచమంతా విశాఖ మహానగరం వైపు చూస్తోంది. ఈ క్రమంలో అధికారులు చారిత్రక నగరం రాజమహేంద్రవరంలో యోగాంధ్ర ఉద్యానం(Yoga Andhra Park)ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు స్థానిక మోడల్ కాలనీలో సుమారు 0.6 ఎకరాల్లో ఉద్యానాన్ని రూ.30 లక్షలతో మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. 2 మీటర్ల వెడల్పుతో 210 మీటర్ల వాకింగ్ ట్రాక్.

50 మందికి పైగా ఆసనాలు వేసేందుకు వీలుగా 1200 చదరపు అడుగుల మండపం ఏర్పాటు చేస్తున్నారు. పతంజలి ధ్యానం చేసే విగ్రహం ముందు కూర్చుని 30 మంది ధ్యానం చేసేందుకు దాని చుట్టూ వలయాకారంలో పంచతత్వ వాకింగ్ ట్రాక్ ఉంటుంది. అలాగే, ఉద్యానవనంలో దాదాపు 25 రకాల ఆయుర్వేద మొక్కలు 10వేలకు పైగా నాటుతున్నారు. పిల్లల ఆట వస్తువులతో పాటు పార్క్ అంతా గ్రీన్ ల్యాన్ సుందరీకరణ దీపాలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి విశాలమైన, ప్రశాంతమైన గ్రీనరీ ప్రదేశాల్లో యోగా, ధ్యానం చేసేందుకు వీలుగా రేపు ప్రారంభించాలనే లక్ష్యంతో వేగంగా పనులు చేస్తున్నారు. అంతేకాదు ఇక్కడ యోగా ఫ్రీ ట్రైనింగ్‌కు కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు.

Next Story