రప్పా రప్పా కామెంట్స్ పై స్పీకర్ అయ్యన్న కౌంట‌ర్‌

by velandi.Saikiran |

జ‌గ‌న్, వైసీపీ నేత‌లు త‌ర‌చూ చేసే ర‌ప్పా ర‌ప్పా కామెంట్స్ కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు కౌంట‌ర్ ఇచ్చారు.

రప్పా రప్పా కామెంట్స్ పై స్పీకర్ అయ్యన్న కౌంట‌ర్‌
X

దిశ‌, వెబ్ డెస్క్ : జ‌గ‌న్, వైసీపీ నేత‌లు త‌ర‌చూ చేసే ర‌ప్పా ర‌ప్పా కామెంట్స్ కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు కౌంట‌ర్ ఇచ్చారు. ఎన్నికల్లో ఓడిపోతే రప్పా రప్పా అని మాట్లాడాలా ? అంటూ ఆగ్ర‌హించారు స్పీక‌ర్‌ అయ్యన్నపాత్రుడు. ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న ఎవరూ అలా మాట్లాడరని జ‌గ‌న్ కు చుర‌క‌లు అంటించారు. రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో గెలుపోటములు సహజం అన్నారు. ఇందిరా గాంధీ, ఎన్టీఆర్ లాంటి మహా నాయకులే ఓడిపోయారని గుర్తు చేశారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.

పోయిన సారి గెలిచి జగన్ ఏం చేశాడు? రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని సీరియ‌స్ అయ్యారు. ప్రభుత్వం ఎక్కడైనా పొరపాట్లు చేస్తే ఎత్తిచూపాల్సిన బాధ్యత ప్రతిపక్షంది అంటూ ఫైర్ అయ్యారు. సభకు వచ్చి ప్రజాసమస్యలపై మాట్లాడి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. అసెంబ్లీకి క‌చ్చితంగా జ‌గ‌న్ రావాల్సిందేన‌న్నారు. వైసీపీ ఎమ్మెల్యేల‌ను అయినా.. అసెంబ్లీకి పంపాల‌ని వెల్ల‌డించారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాకుండా... ఎమ్మెల్యేల‌ను పంపించ‌కుండా.. ఏపీ ప్ర‌జ‌ల‌కు అన్యాయం చేస్తున్నార‌ని ఆగ్ర‌హించారు.

Next Story