- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirupati:భూమనను హౌస్ అరెస్ట్ చేశారంటూ ప్రచారం.. స్పందించిన ఎస్పీ
టీటీడీ ఎస్వీ గోశాలలో 100కు పైగా గోవులు మృతి చెందాయని వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: టీటీడీ ఎస్వీ గోశాలలో 100కు పైగా గోవులు మృతి చెందాయని వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కూటమి నేతలు భూమన(Bhumana Karunakar Reddy) గోశాల సందర్శించాలని డిమాండ్ చేస్తున్నారు. టీటీడీ గోశాలలో ఆవుల మృతిపై తిరుపతిలో కూటమి, వైసీపీ నేతల సవాళ్లు ప్రతిసవాళ్లతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయితే టీడీపీ సవాళ్లపై భూమన కరుణాకర్ రెడ్డి స్పందిస్తూ.. ఈరోజు(గురువారం) ఉదయం గోశాలకు వస్తానని చెప్పారు.
ఈ క్రమంలో భూమనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారంటూ వైసీపీ నేతలు(YCP Leader) ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని పోలీసులు(Police) తీవ్రంగా ఖండించారు. అసలు భూమనను హౌస్ అరెస్ట్ చేయలేదని తిరుపతి ఎస్పీ(Tirupati SP) హర్షవర్ధన్ రాజు(Harshavardhan raju) తేల్చి చెప్పారు. గోశాలకు వెళ్లడానికి భూమనకు అనుమతిని ఇచ్చినట్లు తెలిపారు. కానీ.. రెండు పార్టీల నేతలు ఒకేసారి వెళ్లకూడదని సూచించామని ఎస్పీ వెల్లడించారు. వ్యక్తిగత భద్రతా సిబ్బందితో వెళ్లవచ్చని భూమనకు చెప్పామని ఆయన తెలియజేశారు.






