సంక్రాంతి వేళ ప్ర‌యాణికులకు శుభ‌వార్త‌..ఈ మార్గాల్లో ఏకంగా 12 రైళ్లు

by velandi.Saikiran |

రిజర్వేషన్ తో సంబంధం లేకుండా విశాఖ నుంచి విజయవాడ మధ్య 12 సాధారణ్‌ నడపనున్నట్లు అధికారిక ప్రకటన చేసింది దక్షిణ మధ్య రైల్వే.

సంక్రాంతి వేళ ప్ర‌యాణికులకు శుభ‌వార్త‌..ఈ మార్గాల్లో ఏకంగా 12 రైళ్లు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: సంక్రాంతి పండుగ వచ్చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లాంటి ప్రముఖ పట్టణాల నుంచి తమ సొంతూళ్ల‌కు జనాలు వెళుతున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ లోని బస్టాండ్స్‌, రైల్వే స్టేషన్లు కలకలలాడుతున్నాయి. అయితే సంక్రాంతి కానుకగా రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో రిజర్వేషన్ తో సంబంధం లేకుండా విశాఖ నుంచి విజయవాడ మధ్య 12 సాధారణ్‌ నడపనున్నట్లు అధికారిక ప్రకటన చేసింది దక్షిణ మధ్య రైల్వే.

దువ్వాడ, అనకాపల్లి, య‌లమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం స్టేషన్ల మీదుగా పైన పేర్కొన్న 12 రైళ్లు రాకపోకలు సాగించనున్నట్లు వెల్లడించింది. జనవరి 12వ తేదీ అర్ధ‌రాత్రి నుంచి 18 వ తేదీ వరకు అంటే మొత్తం ఆరు రోజుల పాటు ఈ 12 రైళ్లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారిక ప్రకటన చేసింది. దీంతో ఏపీ ప్రయాణికులకు భారీ ఊరట లభించనుంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్న తర్వాత, అక్కడి నుంచి విశాఖకు వెళ్లేవారు చాలా సులభంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.

Next Story