నంద్యాల ప్రజలకు గుడ్ న్యూస్.. తిరుపతి వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-31 06:38:22  IST  )

నంద్యాల ప్రజలకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది...

నంద్యాల ప్రజలకు గుడ్ న్యూస్.. తిరుపతి వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు
X

దిశ, వెబ్ డెస్క్: నంద్యాల(Nandyala) ప్రజలకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. తిరుపతి(Tirupati) వెళ్లే భక్తులకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 9 నుంచి నవంబర్ 25 వరకు తిరుపతి – చర్లపల్లి – నంద్యాల రూట్‌లో స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుపుతున్నట్లు వెల్లడించింది. 07013 తిరుపతి – చర్లపల్లి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ప్రతి మంగళవారం రాత్రి 9:10 గంటలకు బయలుదేరి, బద్వేల్, నంద్యాల, ఎమిగనూరు, ఆదోని వంటి స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుందని పేర్కొంది. తిరుగు ప్రయాణంగా 07014 చర్లపల్లి – తిరుపతి రైలు ప్రతి బుధవారం మధ్యాహ్నం 4:40కు బయలుదేరి, రాత్రి 10:25 గంటలకు నంద్యాలకు చేరుకుంటుందని ప్రకటించింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో మొత్తం 12 ప్రత్యేక రైళ్లు నడపుతున్నట్లు స్పష్టం చేసింది. దీంతో రైల్వే శాఖకు నంద్యాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story