ఏపీ ప్రయాణికులకు.. మరికొన్ని ప్రత్యేక రైళ్లు

by Vemula.Srinu Prasad |

సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది..

ఏపీ ప్రయాణికులకు.. మరికొన్ని ప్రత్యేక రైళ్లు
X

దిశ, వెబ్ డెస్క్: సంక్రాంతి(Sankranti) పండుగ వేళ బస్సులు(Buses), రైళ్లు(Trains) ఫుల్ అవుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) గుడ్ న్యూస్ తెలిపింది. ఏపీలో మరికొన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది. రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా విజయవాడ-విశాఖ(Vijayawada-Visakha) మధ్య 12 జన్ సాధారణ్ రైళ్లు(Jan Sadaran Trains)ను నడుపుతున్నట్లు పేర్కొంది. ఈ ప్రత్యేక రైళ్లు దుర్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ రోజు నుంచి జనవరి 18 వరకు ఈ రైళ్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. విశాఖలో ఈ రోజు ఉదయం 10 గంటల జన్ సాధారణ్ 08568 ఎక్స్ ప్రెస్ రైలు కదిలిందని, కాసేపట్లో విజయవాడకు చేరుకోనుందన్నారు. అలాగే 08568 విజయవాడ- విశాఖ ప్రత్యేక రైలు ఈ సాయంత్రం 6.30 గంటలకు బయల్దేరి రాత్రి 12.35కు విజయవాడ చేరుకుంటుందని చెప్పారు. ఈ మేరకు ప్రయాణికులు ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Next Story