ప్రయాణికులకు ముఖ్య గమనిక.. ఈ రైళ్ల సేవలు కొనసాగింపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-24 14:33:50  IST  )

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్ డేట్ ఇచ్చింది..

ప్రయాణికులకు ముఖ్య గమనిక.. ఈ రైళ్ల సేవలు కొనసాగింపు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రయాణికుల(Passengers)కు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) కీలక అప్ డేట్ ఇచ్చింది. వీక్లీ స్పెషల్ రైళ్ల(Weekly special trains) సేవలను మరికొన్ని రోజులు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. కాచిగూడ-మధురై, హైదరాబాద్-కొల్లం, హైదరాబాద్-కన్యాకుమారి, నరసాపూర్-తిరువణ్ణామలై మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు ఫిబ్రవరి 2026 వరకు నడుపుతున్నట్లు స్పష్టం చేసింది. ప్రయాణికుల అవసరాల దృష్టా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ సేవలను పొడిగించడం వల్ల వెయిటింగ్ లిస్ట్ సమస్య కొంత తగ్గుతుందని భావించింది.

ఇంకా కొనగుతున్న రద్దీ

సంక్రాంతి ముగిసినప్పటికీ ప్రయాణికుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఇంకా స్వగ్రామాల నుంచి నగరాలకు ప్రయాణికులు తిరిగి వస్తున్నారు. ఉద్యోగాలు, చదువుల కోసం దూరప్రాంతాలకు వెళ్లే వారు సైతం ఎక్కువగా ఉంటున్నారు. దీంతో రైళ్లలో తీవ్ర రద్దీ నెలకొంది. మరోవైపు టిక్కెట్లు సైతం దొరకని పరిస్థితి ఉంది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని వీక్లీ స్పెషల్ రైళ్ల సేవల పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

Next Story