రూ. 620కి కొనద్దా.. మళ్లీ కల్తీ నెయ్యినే కొనాలా: సోము వీర్రాజు ఆగ్రహం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-04 10:44:12  IST  )

తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంపై ఏపీ శాసనమండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది...

రూ. 620కి కొనద్దా.. మళ్లీ కల్తీ నెయ్యినే కొనాలా: సోము వీర్రాజు ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ నెయ్యి(Tirumala Laddu Ghee) వ్యవహారంపై ఏపీ శాసనమండలి(AP Legislative Council)లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పలుమార్లు మండలి వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు(Bjp Mlc Somu Veerraju) మాట్లాడారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party) నాయకులను ఆయన ప్రశ్నించారు. తిరుమల శ్రీవారి నెయ్యిని రూ. 620కి కొనుగోలు చేయవద్దా అని, ఇంకా రూ. 320కే కొనాలా అని ప్రశ్నించారు. లడ్డూ నెయ్యి కల్తీపై శాశ్వత పరిష్కారం కావాలన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూను అపవిత్రం చేస్తే పుట్టగతులు ఉండవ్ అని సోము వీర్రాజు హెచ్చరించారు.

జగన్‌ది ఏ పార్టీ..

అసలు జగన్‌ది ఏ పార్టీ అని సోము వీర్రాజు నిలదీశారు. వెంకన్న బాబుకు రూ.620 నెయ్యి వస్తుందా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం నెయ్యి పేరు చెప్పి రూ. 250 కోట్లు తినిందని, త్వరలో శిక్ష పడబోతోందని జోస్యం చెప్పారు. జగన్ హయాంలో హిందువులను అవమానపర్చారని మండిపడ్డారు. గుడులపై దాడుల జరిగితే అమాయక ప్రజలను అరెస్ట్ చేశారని చెప్పారు. బీజేపీ కార్యకర్తలపై కూడా కేసులు పెట్టారని గుర్తు చేశారు. ఇప్పటికీ హిందువులకు వైసీపీ నేతలు అపచారం చేస్తున్నారని మండిపడ్డారు. రూ. 320కే ఆవు నెయ్యి వస్తుందా అని, వైసీపీ నేతలకు కొంచమైన ఆలోచన ఉండాలి కదా అని సోము వీర్రాజు ప్రశ్నించారు.

Next Story