ఆ బోట్ల‌ను అడ్డుకుంటాం..సోమిరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ !

by velandi.Saikiran |

ఆంధ్రప్రదేశ్ జలాల్లోకి వచ్చిన తమిళనాడు, పుదుచ్చేరి బోట్లను కచ్చితంగా అడ్డుకొని తీరుతామని సోమిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

ఆ బోట్ల‌ను అడ్డుకుంటాం..సోమిరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ !
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే నాయకులు సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ జలాలలో అక్రమ చేపల వేటను అడ్డుకుంటామని తెలిపారు. దీనిపై తమ కూటమి సర్కార్ సీరియస్ గా ఉందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ జలాల్లోకి వచ్చిన తమిళనాడు, పుదుచ్చేరి బోట్లను కచ్చితంగా అడ్డుకొని తీరుతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమ మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడే విధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు.

తాజాగా జువ్వలదిన్నె నుంచి వెళ్లిన నాలుగు బోట్లను లేటెస్ట్ గా పుదుచ్చేరిలో సీజ్ చేసినట్లు వివరించారు. మార్చి 24వ తేదీన తమిళనాడు ప్రభుత్వం కూడా దీనిపై అవగాహన కార్యక్రమం నిర్వహించిందన్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలాల్లోకి వెళ్ళవద్దని అక్కడి రాష్ట్ర మత్స్యకారులను హెచ్చరించినట్లు గుర్తు చేశారు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా డీపీస్ షిప్పింగ్ ను కేంద్రం ప్రోత్సహిస్తుందని గుర్తు చేశారు. ఆ ప్యాకేజీతో వచ్చిన బోట్ల‌తో ఏపీ తీరంలోకి వచ్చి వేటాడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి బోట్ల‌ను అడ్డుకుంటామ‌ని తెలిపారు.

Next Story