పవన్ కల్యాణ్ పేరుతో కోట్లు వసూళ్లు.. అత్తిలి పోలీసులకు పార్టీ నేతల ఫిర్యాదు

by Vemula.Srinu Prasad |

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేరు చెప్పి కొందరు కేటగాళ్లు రెచ్చిపోయారు. మాయ మాటలు చెప్పి కోట్లు వసూలు చేశారు. పైగా నమ్మించేందుకు పవన్ కల్యాణ్ పేరుతో ఉన్న లెటర్ హెడ్‌లను కూడా తయారు చేసి నకిలీ సిఫార్సులతో బురిడీ కొట్టించారు....

పవన్ కల్యాణ్ పేరుతో కోట్లు వసూళ్లు.. అత్తిలి పోలీసులకు పార్టీ నేతల ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Ap Deputy Cm Pawan Kalyan) పేరు చెప్పి కొందరు కేటగాళ్లు రెచ్చిపోయారు. మాయ మాటలు చెప్పి కోట్లు వసూలు చేశారు. పైగా నమ్మించేందుకు పవన్ కల్యాణ్ పేరుతో ఉన్న లెటర్ హెడ్‌లను కూడా తయారు చేసి నకిలీ సిఫార్సు(Fake Recommendation)లతో బురిడీ కొట్టించారు. తాజాగా జరిగి ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా(West Godavari) అత్తిలిలో సంచలనంగా మారింది. దీంతో జనసేన(Janasena) నేతలు హుటా హుటినా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అత్తిలిలో 50 మందికి టోకరా

కాగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని అత్తిలిలో 50 మంది నిరుద్యోగుల నుంచి ఓ గ్యాంగ్ రూ.3 కోట్లు వసూలు చేశారు. పవన్ కల్యాణ్ హోదాతో లెటర్ హెడ్‌పై పోర్జరీ సంతకం చేసి ఆయా శాఖలు, విభాగాల్లో ఉద్యోలిప్పిస్తామని నిరుద్యోగులకు సిఫార్సు లెటర్లు అందజేశారు. ఈ విషయం పవన్ కల్యాణ్ దృష్టికి వెళ్లడంతో పార్టీ సీరియస్ అయింది. జనసేన హైకమాండ్ ఆదేశాలతో పార్టీ నేతలు అత్తిలిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను గుర్తించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.

Next Story