లంచం డిమాండ్.. జైలు పాలైన వీఆర్వో

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-25 12:22:25  IST  )

ప్రభుత్వ అధికారులుగా ఉంటూ కొందరు లంచాలకు అలవాటు పడుతున్నారు....

లంచం డిమాండ్.. జైలు పాలైన  వీఆర్వో
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ అధికారులుగా ఉంటూ కొందరు లంచాలకు అలవాటు పడుతున్నారు. ఏ పని చేయాలన్నా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అందినకాడికి తీసుకుని జేబులు నింపుకుంటున్నారు. తద్వారా అనర్హులు లబ్ధి చేకూరుతోంది. అర్హులకు అన్యాయం జరుగుతోంది. ఇలా డబ్బులు ఇచ్చుకోలేక ఎన్నో పథకాలకు పేదలు దూరమవుతున్నారు. అంతా తెలిసి కూడా కొందరు ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. దీంతో ఏసీబీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. లంచం డిమాండ్ చేసిన వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని జైలుకు పంపుతున్నారు. ఇలాంటి ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. పాసు పుస్తకంలో భూమి వివరాలు చేర్చాలని వీఆర్వోకు రైతు దరఖాస్తు చేశారు. అయితే సదరు వీఆర్వో లంచం డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులకు రైతు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు లంచగొండిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఈ కేసులో వీఆర్వోకు జైలు శిక్ష పడింది.

Next Story