ఎమ్మెల్యే గోవిందరావుపై టీడీపీ అధిష్టానం సీరియస్.. క్షమాపణలు చెప్పాలని ఆదేశం

by Vemula.Srinu Prasad |

విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుల పట్ల కొందరు అధికారదాహంతో వ్యవహరిస్తున్నారు. ...

ఎమ్మెల్యే గోవిందరావుపై టీడీపీ అధిష్టానం సీరియస్.. క్షమాపణలు చెప్పాలని ఆదేశం
X

దిశ, వెబ్ డెస్క్: విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుల(Journalists) పట్ల కొందరు అధికారదాహంతో వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం(Government), ప్రజా ప్రతినిధులు నిర్వహించే కార్యక్రమాలను, సేవలను ఎండనక, వానకన ప్రతినిత్యం ప్రజలకు అందిస్తున్నారని కూడా అర్థం చేసుకోకుండా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. కొన్ని సందర్భాలలో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నారనే అక్కశుతో జర్నలిస్టులను దుర్భాషలాడుతున్నారు. ఇలాంటి ఘటన రాష్ట్రంలో మరోసారి చర్చనీయాంశమైంది.

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు(Pathapatnam Mla Govindarao) ఇటీవల ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఆ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు ఓ ప్రతికా విలేఖరి వెళ్లారు. ఆ సమయంలో ఓ విషయంలో ఎమ్మెల్యేను విలేఖరి ప్రశ్నించారు. దీంతో గోవిందరావు ఊగిపోయారు. నోటికొచ్చినట్లు దుర్భాషలాడారు. అందరిలో విలేఖరిని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో జర్నలిస్టు సంఘాలు, స్థానిక ప్రజలు తప్పుబట్టారు. ఎమ్మెల్యే తీరుపై విమర్శలు కురిపించారు. ఈ విషయం పార్టీ అధిష్టానం దృష్టికి చేరింది. దీంతో ఆ పార్టీ అధ్యక్షుడు సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హుందాగా ఉండాలని, బాధ్యతలు తెలుసుకోవాలని సూచించారు. విలేఖరిని దూషించినందుకు క్షమాపణలు క్షమాపణలు చెప్పాలని ఆదేశించారు. అలాగే జరిగిన ఘటనపై వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యేకు పార్టీ అధ్యక్షుడు సూచించారు. మరోసారి పునరావృతం కాకూడదని హెచ్చరించారు.

Next Story