- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నంద్యాలలో రైళ్ల సమస్యను తీర్చండి : ఎంపీ బైరెడ్డి శబరి
నంద్యాల-గుంతకల్లు (Nandyal-Guntakal) మధ్య పగటిపూట కూడా రైళ్లను నడపాలని ఎంపీ శబరి కోరారు.

దిశ, వెబ్ డెస్క్: నంద్యాల-గుంతకల్లు (Nandyal-Guntakal) మధ్య పగటిపూట కూడా రైళ్లను నడపాలని ఎంపీ శబరి కోరారు. నంద్యాల-గుంతకల్లు మధ్య నాలుగు రైళ్లు నడుస్తున్నా అవి రాత్రి, అర్థరాత్రి సమయంలో రావడంతో ప్రయణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరైన ఎంపీ బైరెడ్డి శబరి (MP Byreddy Shabari) సమస్యను ప్రశ్నోత్తరాల సమయంలో లోక్ సభ దృష్టికి తీసుకెళ్లారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ.. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారిస్తామని హామీనిచ్చారు.
పార్లమెంట్ లో ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ.. నంద్యాల, గుంతకల్లు ప్రాంతాల మధ్య నాలుగు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయన్నారు. అవి చాలా ఇబ్బందికర సమయాల్లో ప్రయాణిస్తాయని పేర్కొన్నారు. అది అర్థరాత్రి 12.55, 1.35, 2.20 గంటలకు వస్తాయన్నారు. మరో రైలు రాత్రి 8.20 గంటలకు ఉందన్నారు. నంద్యాల నుంచి ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణిస్తారని పేర్కొన్నారు. వారిలో విద్యార్థులు, ఉద్యోగులు కూడా ఉంటారన్నారు. కాబట్టి డైలీ మెమూ ట్రైన్ గానీ, ప్యాసింజర్ ట్రైన్ గానీ ఏర్పాటు చేయాలని లోక్ సభ వేదికగా రైల్వే శాఖ మంత్రిని కోరారు. తద్వారా నంద్యాల-గుంతకల్లు మార్గంలో రాకపోకలు సాగించే వారికి లబ్ది చేకూరుతుందన్నారు.
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం ఇస్తూ ఉదయం వేళ రైళ్ల రాకపోకలు లేవనే సమస్యను అర్థం చేసుకుంటామన్నారు. దానిపై సమగ్ర సమాచారం సేకరించి పరిశీలిస్తామన్నారు. నంద్యాలలో మెయింటెనెన్స్ కు సంబంధించిన సాంకేతిక సమస్యలున్నాయని పేర్కొ్న్నారు. ఐసీఎఫ్ కోచ్ మెయింటెనెన్స్ ఫెసిలిటీ గుంతకల్లు ఉందిగానీ నంద్యాలలో లేదన్నారు. కాబట్టి సమస్యకు పరిష్కారం చూడాలని తాను అధికారులకు సూచించామన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమస్యకు పరష్కారం దొరికిన వెంటనే పరిష్కరిస్తామని హామీనిచ్చారు.






