- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫీల్డ్ ఫైరింగ్ ప్రాక్టీస్‌లో జవాను మృతి
భారత సైన్యంలోని 61వ అశ్విక దళ రెజిమెంట్‌కి చెందిన సైనికుడు పరిశా వెంకటేష్ మంగళవారం ఉదయం రాజస్థాన్ ఫీల్డ్ ఫైరింగ్ ప్రాక్టీస్‌లో బుల్లెట్ బ్యాక్ ఫైర్ అయ్యి మృతిచెందారు.

దిశ ప్రతినిధి, బాపట్ల: భారత సైన్యంలోని 61వ అశ్విక దళ రెజిమెంట్‌కి చెందిన సైనికుడు పరిశా వెంకటేష్ మంగళవారం ఉదయం రాజస్థాన్ ఫీల్డ్ ఫైరింగ్ ప్రాక్టీస్‌లో బుల్లెట్ బ్యాక్ ఫైర్ అయ్యి మృతిచెందారు. Suratgarh military హాస్పిటల్ నుంచి ఈరోజు అమర జవాన్ వెంకటేష్ పార్థివదేహం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో NCC GP HQ లెఫ్టినెంట్ కల్నల్ అంకిత్ శర్మ, అమర జవాన్ వెంకటేష్ బంధువులు లాంఛనంగా స్వీకరించారు. పార్థివ దేహాన్ని స్వగ్రామమైన పిట్టలవాని పాలెంకు కొద్దిసేపటి క్రితమే తరలించారు. రేపు అంటే ఫిబ్రవరి 21 ఉదయం అతని స్వగ్రామమైన పిట్టలవానిపాలెం మండలం గౌడ పాలెం గ్రామంలో లాంఛనప్రాయ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. అమర జవాన్ వెంకటేష్ అంతిమయాత్రలో భారత సైన్యం ప్రతినిధులు, రాష్ట్ర మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొనే అవకాశం ఉంది.






