- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ ఇంటర్ విద్యా విధానంలో కీలక మార్పులు
ఏపీలో ఇంటర్ విద్యా విధానంలో బోర్డు కీలక మార్పులు చేసింది. ఇంటర్ విద్యావిధానంలో కొత్తగా ఎలక్టివ్ సబ్జెక్ట్ విధానాన్ని తీసుకువచ్చింది. దీంతో ఏ గ్రూప్ విద్యార్థులు అయినా 24 సబ్జెక్టుల్లో నచ్చిన వాటినికి ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఇంటర్ విద్యా విధానంలో బోర్డు కీలక మార్పులు చేసింది. ఇంటర్ విద్యావిధానంలో కొత్తగా ఎలక్టివ్ సబ్జెక్ట్ విధానాన్ని తీసుకువచ్చింది. దీంతో ఏ గ్రూప్ విద్యార్థులు అయినా 24 సబ్జెక్టుల్లో నచ్చిన వాటినికి ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా గణితం సబ్జెక్టును 1ఏ, 1బీ ఒకే సబ్జెక్ట్గా మార్చింది. గతంలో ఒక్కో పేపర్కు 75 మార్కులు ఉండగా పాస్ మార్కులు 26, ఇప్పుడు గణితం ఒక్కో పేపర్ 100 మార్కులుగా నిర్ణయించింది.
దీంతో పాస్ మార్కులు 35గా నిర్ణయించింది. బైపీసీలో బోటనీ, జువాలజీ కలిపి బయాలజీగా మార్చింది. కాగా ఫస్టియర్లో 85 మార్కులకు పరీక్ష నిర్వహిస్తే 29 మార్కులు వస్తే పాస్ గా నిర్ణయించింది. సెకండియర్ లో 30 మార్కులు వస్తే పాస్ గా మార్చింది. అదే విధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ విద్యార్థులకు ప్రాక్టికల్ మార్కులను 30 మార్కులుగా నిర్ణయించింది. అయితే గతంలో ఫెయిల్ అయ్యి పరీక్షలు రాస్తున్న వారికి ఈ మార్పులు వర్తించవని స్పష్టం చేసింది.






