- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీకాళహస్తి ఆలయంలో పాము కలకలం
by Naga Rani Yarlagadda |
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి (Srikalahasti) ఆలయంలో పాము కనిపించడంతో కలకలం రేగింది.

X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి (Srikalahasti) ఆలయంలో పాము కనిపించడంతో కలకలం రేగింది. ఆలయ ప్రాంగణంలోకి 7 అడుగుల పొడవైన పాము రావడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. ఆలయంలో రాహుకేతు పూజలు (Rahu Kethu Pooja) జరిగే మండపం మెట్ల వద్ద పాము హల్చల్ చేసింది. వెంటనే ఆలయ అధికారులు అటవీ సిబ్బందికి సమాచారం అందించగా.. అక్కడికి చేరుకున్న సిబ్బంది పామును చాకచక్యంగా పట్టుకుని సంచిలో బంధించారు. సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి పామును వదిలేయడంతో భక్తులంతా ఊపిరి పీల్చుకున్నారు.
Next Story






