Red Sandal Wood Smuggling: ఉద్దిమడుగులో ఎర్రచందనం స్లగ్లింగ్..టాస్క్ ఫోర్స్ రైడ్స్

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-18 07:17:21  IST  )

ఆంధ్రప్రదేశ్(AP) కడప జిల్లా(Kadapa District) ఉద్దిమడుగు అటవీ ప్రాంతం(Uddimadu Forest Area)లో ఎర్రచందనం స్మగ్లింగ్(Smuggling Of Red Sandal Wood)ను రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్(RSASTF) విజయవంతంగా అడ్డుకుంది

Red Sandal Wood Smuggling: ఉద్దిమడుగులో ఎర్రచందనం స్లగ్లింగ్..టాస్క్ ఫోర్స్ రైడ్స్
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్(AP) కడప జిల్లా(Kadapa District) ఉద్దిమడుగు అటవీ ప్రాంతం(Uddimadu Forest Area)లో ఎర్రచందనం స్మగ్లింగ్(Smuggling Of Red Sandal Wood)ను రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్(RSASTF) విజయవంతంగా అడ్డుకుంది. ఉద్దిమడుగు అటవీ ప్రాంతంలో రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్ జరిపిన దాడిలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయగా, 27 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక మోటారు సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు.

టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్.సుబ్బారాయుడు ఆదేశాలతో ఎస్పీ పీ. శ్రీనివాస్, డీఎస్పీ జి. బాలిరెడ్డి మార్గనిర్దేశకత్వంలో ఆర్ఐ (ఆపరేషన్స్) చిరంజీవి, ఆర్ఎస్ఐ మురళీధర్ టీమ్ స్థానిక అటవీ శాఖ అధికారులు పి.ఇందిర, జి.కిషోర్ కుమార్ లతో కలసి ఉద్దిమడుగు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. ఉద్దిమడుగు వైపు గల ఎర్రచందనంఎంట్రీ, ఎగ్జిట్, డంపింగ్, లోడింగ్ పాయింట్లను తనిఖీ చేసుకొంటూ వెలుతున్న క్రమంలో భాకరాపేట ఫారెస్ట్ సెక్షన్ పరిధిలో జామాయిల్ ప్లాంటేషన్ వద్ద కొందరు వ్యక్తులు ఎర్రచందన మొద్దులను మోసుకుని వెళుతూ కనిపించారు.

వారిని టాస్క్ ఫోర్స్ టీమ్ చుట్టుముట్టే ప్రయత్నం చేయగా వారు పారి పోయారు. వారిని వెంబడించిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఒకరిని అరెస్టు చేశారు. ఆ ప్రాంతంలో 27 ఎర్రచందనం దుంగలు, మోటార్ సైకిల్ స్వాదీనం చేసుకున్నారు. పారిపోయిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. పట్టుబడిన వ్యక్తిని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. ఎస్ఐ రఫీ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story