- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అధికార వైసీపీ అండతోనే స్మగ్లర్ల రాజ్యం నడుస్తోంది : నాదెండ్ల మనోహర్
వైసీపీ ప్రభుత్వ అండతోనే రాష్ట్రంలో స్మగ్లర్ల రాజ్యం నడుస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వ అండతోనే రాష్ట్రంలో స్మగ్లర్ల రాజ్యం నడుస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి శేషాచలం అడువుల్లో విలువైన ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించే ముఠాకు వైసీపీ నాయకులు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. అన్నమయ్య జిల్లాలో కానిస్టేబుల్‌ను వాహనంతో ఢీకొట్టి హత్య చేశారని, అది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని పేర్కొన్నారు. ఘటనపై వెంటనే ఎంక్వయిరీ వేసి దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ సందర్భంగా ఏఆర్ కానిస్టేబుల్ గణేశ్ కుటుంబానికి ధైర్యం చెబుతూ సానుభూతిని వ్యక్తం చేశారు. స్మగ్లర్ల పట్ల ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని ఆరోపించారు.
- Tags
- nadendla manohar
Next Story






