- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నారాలోకేష్‌పై స్మృతి మందాన ప్రశంసలు
మంత్రి నారాలోకేష్ పై టీమ్ ఇండియా మహిళా క్రికెటర్ స్మృతి మందన ప్రశంసలు కురిపించారు. ఓ ఇంటర్వ్యూలో నారాలోకేష్ తో పాటు స్మృతి మందన, మిథాలీ రాజ్ పాల్గొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: మంత్రి నారాలోకేష్ పై టీమ్ ఇండియా మహిళా క్రికెటర్ స్మృతి మందాన ప్రశంసలు కురిపించారు. ఓ ఇంటర్వ్యూలో నారాలోకేష్ తో పాటు స్మృతి మందాన, మిథాలీ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ స్టేడియంలోని ఒక స్టాండ్‌ను లెజెండరీ ప్లేయర్ మిథాలీ రాజ్‌కు అంకితం చేయడం అద్భుతమని మందన కొనియాడారు. స్టేడియంలో స్టాండ్‌కు మహిళా క్రికెటర్ల పేర్లు పెట్టడం అభినందనీయం అని చెప్పారు. మిగిలిన రాష్ట్రాల క్రికెట్ సంఘాలు కూడా ఆంధ్రప్రదేశ్‌ను స్పూర్తిగా తీసుకోవాలని సూచించారు. అయితే నిజానికి ఈ ఇంటర్వ్యూ ఆగస్టులో జరగ్గా దానికి సంబంధించిన వీడియో క్లిప్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇటీవలే ఉమెన్స్ టీం ఇండియా జట్టు ప్రపంచ కప్ సాధించిన సంగతి తెలిసిందే. దీంతో లోకేష్ ట్వీట్ వైరల్ గా మారింది. ఆయనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.






