సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. ఆందోళనలో ప్రయాణికులు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-20 06:58:09  IST  )

ఇటీవల కాలంలో ఎక్స్ ప్రెస్ రైళ్లు అగ్నిప్రమాదాలకు గురవుతున్నాయి. గతేడాది డిసెంబరు నెలాఖరులో ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ లో భారీ అగ్నిప్రమాదం జరిగి ఒకరు సజీవదహనమయ్యారు.

సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. ఆందోళనలో ప్రయాణికులు
X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో ఎక్స్ ప్రెస్ రైళ్లు అగ్నిప్రమాదాలకు గురవుతున్నాయి. గతేడాది డిసెంబరు నెలాఖరులో ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ లో భారీ అగ్నిప్రమాదం జరిగి ఒకరు సజీవదహనమయ్యారు. వారంరోజుల క్రితం పూరీ - తిరుపతి ఎక్స్ ప్రెస్ రైలులోని ఏసీ కంపార్టుమెంట్లో మంటలు చెలరేగాయి. తాజాగా విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్తున్న సింహాద్రి ఎక్స్ ప్రెస్ లో పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన లోకో పైలట్ వెంటనే రైలును నిలిపివేశాడు. బ్రేక్ పట్టేయడంతో రైలు నుంచి పొగలు వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనతో దాదాపు 2 గంటల నుంచి సింహాద్రి ఎక్స్ ప్రెస్ హంసవరంలోనే నిలిచిపోయింది. పండుగ సెలవులు పూర్తవ్వడంతో తిరుగు పయనంలో ఉన్న ప్రయాణికులు రైలు వద్ద పడిగాపులు పడుతున్నారు.
Next Story